సాధారణంగా కుక్క, పిల్లి వంటి పెంపుడు జంతువుల చేష్టలు చాలా ఆసక్తిగా ఉంటాయి. పిజ్జా కోసం ఒక పిల్లి దీనంగా అడుక్కునే తీరు నవ్వులు పూయించింది. పిల్లుల ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయ్యింది. ఒక వ్యక్తి చేతిలోని పిజ్జా చూసి ఒక నల్ల పిల్లి పిల్లకు నోరూతుంది. దీంతో ఆ పిజ్జాను తనకు ఇవ్వమని ప్రాధేయపడుతుంది. ముందరి కాళ్లతో పలుమార్లు నమస్కరించి ఆ వ్యక్తిని వేడుకుంటుంది.
కాగా, ఈ వీడియోను ఆ పిల్లి తరపునే క్యాప్షన్ చేశారు. అందులో ఇలా ఉంది. ‘అందరికీ నమస్కారం! కొత్త ఫాలోయింగ్లందరికీ ధన్యవాదాలు. కొత్త వ్యక్తులందరికీ నన్ను పరిచయం చేసుకోవడానికి ఈ సమయాన్ని వెచ్చించాలని అనుకున్నాను. నా పేరు వాడ్స్‌వర్త్, అకా వాడీ. నాకు అడుక్కోవడం చాలా ఇష్టం. జాక్స్, కట్లర్, మిస్టరీ అనే ముగ్గురు తోబుట్టువులు నాకు ఉన్నారు’ అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.
మరోవైపు ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన తొలి రోజు నుంచే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఇప్పటి వరకు 14 లక్షల మందికిపైగా దీనిని వీక్షించారు. పలువురు తమ పెంపుడు పిల్లుల ఫొటోలను జత చేసి కామెంట్లు చేశారు.