దేశవ్యాప్తంగా పెండ్లిండ్లలో చోటుచేసుకుంటున్న ఘటనలకు సంబంధించిన హిలేరియస్ వీడియోలు నెట్టింట తరచూ సందడి చేస్తున్నాయి. ఈ తరహా వీడియో మరొకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతో్ంది. ఈ వీడియోలో మంటపంపై తమ పెండ్లి జరుగుతుండగా వధూవరులు ఎంచక్కా ఫోన్లలో పబ్జీ గేమ్‌లో తలమునకలవడంతో అందరూ అవాక్కవుతున్నారు. నిరంజన్ మహాపాత్ర అనే యూజర్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది చక్కర్లు కొడుతోంది.