లండన్ : బాయ్‌ఫ్రెండ్ తల్లి మరణించడంతో తల్లి లేని లోటు తీర్చేందుకు ఏకంగా అతడి తండ్రిని పెండ్లి చేసుకోవాలని మహిళ నిర్ణయించుకున్న ఉదంతం వెలుగుచూసింది. క్లిష్టసమయంలో అతడికి అండగా నిలిచేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె చెబుతోంది. బాయ్‌ఫ్రెండ్ తండ్రిని ఎందుకు అనూహ్యంగా వివాహం చేసుకోవాల్సి వచ్చిందని టిక్‌టాక్ యూజర్ వైఎస్.అమ్రి ఇచ్చిన వివరణపై నెటిజన్లు తలో రకంగా స్పందిస్తున్నారు.
తన బాయ్‌ఫ్రెండ్ తల్లి మరణించడంతో..అతడు విషాదంలో మునిగిపోవడం తనకు ఇష్టం లేదని..బాయ్‌ఫ్రెండ్‌కు తల్లిని తిరిగి అందించేందుకు తాను ప్రియుడి తండ్రిని పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నానని ఆమె చెప్పుకొచ్చింది. ఆమె త్యాగాన్ని కొందరు నెటిజన్లు మెచ్చుకోగా మరికొందరు ఇది అర్ధం లేని నిర్ణయమని తప్పుపట్టారు.