తెలంగాణ రాష్ట్ర సాధకుడు, ఉద్యమ సారథి కేసీఆర్( KCR ) వెంటే తమ పయనం కొనసాగుతూనే ఉంటుందని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ( BRS Australia ) శాఖ వెల్లడించింది. ఈమేరకు నిన్న, నేడు, రేపు కేసీఆర్ వెంటే తమ పయనం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ ఆస్ట్రేలియా నాయకుడు నాగేందర్ రెడ్డి కాసర్ల ( Nagendhar Reddy Kasarla ) మాట్లాడుతూ తెలంగాణ కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే వరకు నిరంతరం కష్టపడతామని స్పష్టం చేశారు.
నాటి ఉద్యమం నుంచి పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం తమ బాధ్యత అని తెలిపారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల నుంచి సాధారణ ఎన్నికల వరకు ప్రతి ఎన్నికలోనూ చురుకుగా ప్రచారం నిర్వహించి తమ సత్తాను చాటామని పేర్కొన్నారు.
భవిష్యత్తులో కూడా అదే ఉత్సాహంతో ముందుకు సాగుతామని ఆయన పేర్కొన్నారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గోస పడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సాయిరాం ఉప్పు, వినయ్ చెలుపాటి, ఉదయ్ సింహా రెడ్డి, సూర్య రావు, సనిల్ రెడ్డి, సతీష్ పులిపాక, అశోక్ ఈగ, నితీష్ గౌడ్, వెంకట్, భాస్కర్, విశ్వనాధ్, సంజూ రెడ్డి, తెలంగాణ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.