Australia | ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీలో బతుకమ్మ- దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు. వెలమ అసోసియేషన్ ఆఫ్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో దాదాపు 300 మంది ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతిని గౌరవిస్తూ ఈ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేసినందుకు ఈ సందర్భంగా నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు.
బతుకమ్మ – దసరా వేడుకల నిర్వహణ కోసం గత కొద్దినెలలుగా కష్టపడిన వెలమ కమిటీ సభ్యులకు ఈ సందర్భంగా అసోసియేషన్ కృతజ్ఞతలు తెలిపింది. కమిటీ సభ్యులు ఆర్థికంగా సహకరించడంతో పాటు తమ వ్యక్తిగత సమయాన్ని కేటాయించి కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు కృషి చేశారని కొనియాడారు. ఈ సందర్భంగా నిర్సింగ రావు జెగ్గన్నగారి, రాజేశ్ అర్షనపల్లి, శ్రీనివాసరావు తక్కళ్లపల్లి, కల్యాన్ రావు గండ్ర, రాజేశ్ బల్మూరి, అనిల్, పవన్, రంగారావు రంగినేని, హరికృష్ణ అయిలినేని, మల్హర్ రావు సాయినేని, వినయ్ తాండ్ర, రమణరావు అంగూరు, కిషన్ రావు చెప్యాల, వామన రావు, రామశంకర్ రావు, కార్తీక్, సందీప్, వాసు, మధు మోహన్ రావు, శ్రీలత, సుష్మిత, వనజ, లావణ్య, స్వప్న, కవిత, నమ్రత, రజిత, సరిత, సుచరిత తదితరులకు ధన్యవాదాలు తెలిపారు.
వెలమ అసోసియేషన్ ఆఫ్ ఆస్ట్రేలియా2018 నుంచి బతుకమ్మ, దసరా పండుగలను నిర్వహిస్తుంది. ప్రతి ఏటా ఈ వేడుకలో పాల్గొనే వారి సంఖ్య పెరుగుతుండటంపై అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. తమ అసోసియేషన్ పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు భారతదేశంలోని అనేక పేద కుటుంబాలకు సాయం అందించిందని తెలిపారు. కుటుంబ పరిస్థితుల కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు కూడా తాము మద్దతు అందిస్తున్నామని పేర్కొన్నారు.
Australia1