హైదరాబాద్: మలిదశ తెలంగాణ ఉద్యమంలో మహిళా నేతగా కీలక పాత్ర పోషించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను దక్షిణాఫ్రికాలో టీఆర్ఎస్ సౌతాఫ్రికా సెల్ ఘనంగా నిర్వహించింది. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం పరితపిస్తూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్ని విశ్వవ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించారని అభినందించింది.
మన ఇంటి ఆడబడుచు, కల్వకుంట్ల కవిత జన్మ దిన వేడుకలను టీఆరెస్ ఎన్నారై సౌతాఫ్రిక శాఖ అద్యక్షులు గుర్రాల నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకోవడంలో తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడంలో కల్వకుంట్ల కవిత ఎనలేని క్రుషి చేశారని గుర్రాల నాగరాజు పేర్కొన్నారు.
తెలంగాణ సంస్కృతి సంప్రదాయలపై కవిత పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారని గుర్రాల నాగరాజు కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో సైతం ఆమె కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో తెరాస సౌత్ఆఫ్రికా కోర్ కమిటీ సభ్యులు నరేందర్ రెడ్డి మేడసాని, హరీశ్ రంగా, కిరణ్ కుమార్ బెల్లి, సాయి కిరణ్ నల్లా, శివా రెడ్డి, నవదీప్ రెడ్డి గుడిపాటి, అరవింద్ చీకోటి, జై గుండా విష్ణు, వెంకట రావు తాళ్ళపల్లి, సాయి కిరణ్ వేముల తదితరులు పాల్గొన్నారు.