హైదరాబాద్: తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తను సౌతాఫ్రికా టీఆర్ఎస్ ఎన్నారై విభాగం సెక్రెటరీ హరీష్రంగా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సౌతాఫ్రికాలో తెలంగాణ పర్యాటక రంగాన్ని ప్రమోట్ చేయడానికి సహకరించాలని కోరారు.
వీలు చూసుకుని ఒకసారి సౌతాఫ్రికాకు రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా సౌతాఫ్రికాలో టీఆర్ఎస్ ఎన్నారై బృందం చేస్తున్న కృషిని ఉప్పల శ్రీనివాస్ గుప్తా మెచ్చుకున్నారు. కరోనా సంక్షోభం సమయంలో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ను అవసరమైన వారికి అందించడంతో ఎన్నారై టీమ్ బాగా పనిచేసిందన్నారు.