బహ్రెయిన్ : బహ్రెయిన్‌లో ఎన్నారై బీఆర్ఎస్ సెల్ అధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నారై బీఆర్ఎస్.సెల్ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ అధ్యక్షతన అండాలస్ గార్డెన్లో జరిగిన ఈ వేడుకల్లో కేకును కట్ చేసి ఆనందోత్సాలతో ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సంధర్భంగా సతీష్ కుమార్, ఉపాధ్యక్షుడు వెంకటేష్ బొలిశెట్టి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకోసం చావు నోట్లో తల పెట్టి తెలంగాణను సాధించారు.
కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ కు వచ్చిన పేరు ప్రతిష్టలు చూసి ఓర్వలేకనే రాజకీయ దురుద్దేశంతో కుట్ర పూరితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. కేసీఆర్, కేటీఆర్‌కు నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఎన్నారై బీఆర్ఎస్ బహ్రెయిన్ శాఖ ఖండిస్తుందన్నారు. కేసీఆర్ లేని తెలంగాణను ప్రజలు ఊహించుకోలేకపోతున్నారని పేర్కొన్నారు.
ఎన్నారై బీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ శాఖ ప్రధానకార్యదర్శిలు మగ్గిడి రాజేందర్, అన్నారం సుమన్ మాట్లాడుతూ ప్రజాపాలనలో ప్రతిరోజు ప్రజలను కలుస్తా అని చెప్పి మాటతప్పి100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అంటూ మోసపూరిత హామీలతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. త్వరలో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రానున్న రోజుల్లో గల్ఫ్ లో కుడా బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించ బోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు, సంగేపు దేవన్న, ఉత్కం కిరణ్ గౌడ్, నాగుల లక్ష్మణ్, సంగేపు సందీప్ తదితరులు పాల్గొన్నారు.