NRI | లండన్లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం, మాజీ మంత్రి హరీశ్ రావు జన్మదిన వేడుకలను లండన్లో ఘనంగా నిర్వహించారు.
లండన్ : ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం, మాజీ మంత్రి హరీశ్ రావు జన్మదిన వేడుకలను లండన్లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకుంటూ రెండు నిమిషాల మౌనం పాటించి ఘన నివాళులు అర్పించారు.
ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి నాయకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రవాస తెలంగాణవాసులు, పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.ఉపాధ్యక్షులు హరి గౌడ్ నవాపేట్, సత్యమూర్తి చిలుముల మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అమరవీరుల త్యాగాలు, ప్రజల చిరకాల ఆకాంక్షలు, కేసీఆర్ నాయకత్వంలో సాగిన ఉద్యమ ఫలితమని అన్నారు.
యూత్ వింగ్ నాయకురాలు అమరేశ్వరి బోయిన మాట్లాడుతూ.. నేటి తరానికి తెలంగాణ ఉద్యమ చరిత్రను, కేసీఆర్ పోరాట విషయాల్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండాలని, చరిత్ర తెలియకుండా చాలా మంది చౌకబారు రాజకీయ విమర్శలు చేస్తున్నారన్నారు. అలాగే మాజీ మంత్రి హరీశ్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
జనరల్ సెక్రటరీ రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ హరీశ్ రావు ప్రజలతో మమేకమై పనిచేసే నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారని అన్నారు. ఆయన ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎన్నారై బీఆర్ఎస్ యూకే నాయకులు అంజాన్ రావు, కార్యదర్శి (ఐటీ, మీడియా & పీఆర్) రవి ప్రదీప్ పులుసు, వెంకట్ రెడ్డి దొంతుల, సురేష్ బుడగం, రామకృష్ణ, పవన్ గౌడ్, అంజన్ రావు, అమరేశ్వరి, హరికృష్ణ, రాజు, సాయి, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajnath Singh | దేశాన్ని అస్తిర పరిచేందుకు, ప్రభుత్వాన్ని కూల్చేందుకే ఆందోళనలు.. ఇండియా బ్లాక్పై రాజ్నాథ్ సింగ్ ఆరోపణ
KTR | ఆంధ్రలో జల పండగ ఎట్లయితది? తెలంగాణలో కరువు ఎందుకుంటది? సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే నివాసానికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు.. ర్యాలీకి వెళ్లకూడదంటూ నోటీసులు జారీ
Kumbha | ‘కుంభ’లోని శక్తిని ఇప్పుడే తట్టిలేపాలని అనుకోవడం లేదు.. పృథ్వీరాజ్ బర్త్డేపై రాజమౌళి ట్వీట్
Vidya Balan | ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్.. నా కల నెరవేరలేదంటూ విద్యాబాలన్ భావోద్వేగం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

