TAUK | లండన్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha )పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ బండి సంజయ్( Bandi Sanjay )పై టాక్ లండన్( TAUK London ) ఉపాధ్యక్షురాలు శుష్మణ రెడ్డి( Shushmana Reddy ) మండిపడ్డారు.
రాజకీయాల్లో హుందాగా విమర్శలు చేయాలి కానీ ఇలా మహిళా లోకాన్ని కించపరిచేలా మాట్లాడటం సరికాదన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలను ఎన్ఆర్ఐ సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. ఎమ్మెల్సీ కవితకు తక్షణమే బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని శుష్మణ డిమాండ్ చేశారు. బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసిన కవిత ఆడబిడ్డలందరి ప్రతిరూపమని వారిని కించపరిస్తే ఆడబిడ్డలెక్కడున్నా తగిన బుద్ది చెప్తారని హెచ్చరించారు.