Sankara Nethralaya | అమెరికాలో ఈ నెల 3న నిర్వహించిన శంకర నేత్రాలయ మ్యూజికల్ కాన్సర్ట్ అద్భుత విజయం సాధించింది. అరిజోనా రాష్ట్రంలోని ఫీనిక్స్ నగరంలో తొలిసారిగా తెలుగు కాన్సర్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీత ప్రదర్శన హైలెట్‌గా నిలిచింది. మూడు గంటలకు పైగా సాగిన ఈ కాన్సర్ట్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకర్షించింది.
అదే రోజు సాయంత్రం డాక్టర్ ఎస్.ఎస్. బద్రినాథ్ గారు, రతన్ టాటాను సర్మించుకున్నారు. శంకర నేత్రాలయ USA పయనాన్ని, సంస్థ స్థాపించినప్పటి నుంచి నేటి ప్రస్తుత కార్యక్రమాలను ఆహుతులకు వివరించారు. వ్యవస్థాపకుడు, అధ్యక్షులు ఎమిరేటస్ ఎస్.వి. ఆచార్య , ప్రస్తుత అధ్యక్షుడు బాలా రెడ్డి ఇందుర్తి నాయకత్వంలో సంస్థ తన సేవలను విస్తరించిందని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర దృష్టి సంరక్షణను అందించే మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) కార్యక్రమం ద్వారా చెన్నై, హైదరాబాద్, జార్ఖండ్ కేంద్రాలతో పాటు, పుట్టపర్తి, విశాఖపట్నం కేంద్రాల కోసం ప్రణాళికలను వివరించారు.
ఈవెంట్ ద్వారా సుమారు 1.2 లక్షల డాలర్ల విరాళాలను సమీకరించారు. ఇందులో ఆరు MESU దాతల విరాళాలు కూడా ఉన్నాయి. కాగా, ఈ ఈవెంట్ మధ్యలో MESU దాతలను సత్కరించి, కొత్త ప్రతిజ్ఞలను స్వీకరించారు. 2025లో తమిళనాడుకు ఒక MESU యూనిట్ విరాళం ఇవ్వడానికి మరొక దాత ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమం ముగిసే సమయానికి, మొత్తం ఆరు MESU యూనిట్ల కోసం, తమిళనాడుకు ఇద్దరు, ఆంధ్రప్రదేశ్‌కు ఇద్దరు దాతలు ముందుకు వచ్చారు.
Sankara Nethralaya Mucical Concert
కాన్సర్ట్ తర్వాత, చాండ్లర్‌లోని ఫిరంగీ రెస్టారెంట్లో ప్రత్యేక మీట్-అండ్-గ్రీట్ ఏర్పాటుచేశారు, అక్కడ మణి శర్మ సంతకంతో ఉన్న ఫోటోలను వేలం వేశారు. అలాగే, గురువారం రాత్రి పియోరియాలో మణిశర్మ గారి, వారి బృందానికి ప్రత్యేక సాయంకాలపు కార్యక్రమం నిర్వహించారు. ఈ రెండు వేలం పాటల ద్వారా మొత్తం $4,875 సేకరించారు. ఇది శంకర నేత్రాలయ MESU కార్యక్రమం ద్వారా 75 కాటరాక్ట్ శస్త్రచికిత్సలకు నిధులను అందించిందని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించి మూర్తి రేఖపల్లి, శ్యాం అప్పలికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే వంశీ కృష్ణ ఇరువారం (జాయింట్ సెక్రటరీ),ఆది మొర్రెడ్డి, రేఖ వెమాల , ధీరజ్ పోలా , శరవణన్, శ్రీధర్ చెమిడ్తి, సాకేత్, సీత గంట, టెర్రీ కింగ్, సరిత గరుడ, రాజ్ బండి, శోభ వడ్డిరెడ్డి, లక్ష్మి బొగ్గరపు , రూప మిధే, మణు నాయర్, చెన్నా రెడ్డి మద్దూరి, కాశీ, మూర్తి వెంకటేశన్, మంజునాథ్, దేవా, జయప్రకాశ్, మహిత్‌కు ధన్యవాదాలు తెలిపారు. షైనింగ్ స్ప్రౌట్స్ , లవింగ్ కైండ్‌నెస్ బృందాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వారి ఆత్మీయత, కార్యక్రమాల కంటే శంకర నేత్రాలయ మిషన్‌ను ప్రోత్సహించడంపై ఉన్న నిబద్ధత నిజంగా స్ఫూర్తిదాయకమని కొనియాడారు. కాగా ఈ కార్యక్రమానికి హాజరైన వాళ్లందరూ శంకర నేత్రాలయ చేస్తున్న కృషి పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఫీనిక్స్ శాఖలో చేరేందుకు పలువురు ఆసక్తి చూపించారు.