తెలంగాణలో ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపయోగించిన భాషపై బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల (Mahesh Bigala) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధి హోదాలో ఉండి ఇలాంటి పదజాలం వాడటం బాధాకరమని ఆయన అన్నారు. “బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేస్తా” నని అన్న వ్యాఖ్యలు మంచిది కాదు అని పేర్కొన్నారు.
ప్రపంచమంతా తెలంగాణ గౌరవాన్ని పెంచుతూ కష్టపడి జీవనం సాగిస్తున్న ఎన్ఆర్ఐలను అవమానిస్తూ మాట్లాడటం తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. “తల్లిదేశం కోసం చెమటోడ్చిన ప్రతి తెలంగాణ బిడ్డ గౌరవం మన గౌరవమే నని పేర్కొన్నారు. కేటీఆర్ తక్కువచేసేలా మాట్లాడటం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐ తెలంగాణవాసులందరికీ అవమానమే నని అన్నారు. కేటీఆర్ నాయకత్వం, దూరదృష్టి పట్ల తమకు ఎంతో గర్వంగా ఉందని స్పష్టం చేశారు. శ్రమకు గౌరవం ఇవ్వడమే నిజమైన సాంస్కృతిక విలువ అని సూచించారు. ముఖ్యమంత్రికి ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు.