TCSS | తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) (TCSS) అధ్యక్షుడిగా రమేశ్‌బాబు రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రమేశ్‌బాబుతో పాటు ఆయన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ప్రతిపాదించడంతో పాటు నామినేషన్ గడువులోగా ఒకే టీమ్ నుంచి నామినేషన్ రావడంతో ఎన్నిక ఏకగ్రీవమైందని ఎన్నికల అధికారి దోర్నాల చంద్రశేఖర్ ప్రకటించారు.
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) 11వ వార్షిక సర్వసభ్య సమావేశం నవంబర్ 17వ తేదీన స్థానిక ఆర్యసమాజ్‌లో నిర్వహించారు. గోనె నరేందర్ రెడ్డి సొసైటీకి చేసిన సేవలను స్మరించుకుని నివాళులు అర్పించిన అనంతరం ఈ సమావేశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్వసభ్య సమావేశపు వివరాలతో పాటు 2023-2024 ఆర్థిక సంవత్సరపు రాబడి, ఖర్చుల పట్టికను సభ్యులకు వివరించి ఆమోదం పొందడం జరిగింది. 2023-2024 ఆర్థిక సంవత్సరానికి ఆడిటర్లుగా సేవలందించిన గార్లపాటి లక్ష్మా రెడ్డి, బండారు శ్రీధర్‌కు కృతజ్ణతలు తెలియజేశారు. ఈ సందర్భంగానే రమేశ్‌బాబు అధ్యక్షుడిగా ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. ఎన్నికల అధికారులుగా వ్యవహరించిన దోర్నాల చంద్రశేఖర్ సురేశ్ మాటేటీకి సొసైటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Tcss2
తనను అధ్యక్షుడిగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు రమేశ్‌బాబు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. నూతన కార్యవర్గం సహకారంతో సొసైటీని అభివృద్ధి చేయడానికి మరింత కృషి చేస్తానని తెలిపారు. ఎప్పుడూ సహాయ సహకారాలు అందిస్తున్న కార్యవర్గ, కార్యనిర్వాహక వర్గ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్పారు.
ఈ సమావేశంలోనే 2024-2025 ఆర్థిక సంవత్సరానికి ఆడిటర్లుగా కిరణ్ కైలాసపు, తెల్లదేవరపల్లి వెంకట కిషన్ రావును ఎన్నుకున్నారు. గత 8 సంవత్సరాలుగా ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించిన బసిక ప్రశాంత్ కుమార్‌ను ఈ సారి ఉపాధ్యక్షులుగా.. ప్రాంతీయ కార్యదర్శులుగా సేవలు అందించిన బొందుగుల రాము, నంగునూరు వెంకట రమణ ఈ సారి ప్రధాన కార్యదర్శి.. కోశాధికారిగా సేవలు అందించిన జూలూరి సంతోశ్ కుమార్ ఈ సారి ఉపాధ్యక్షులుగా సేవలు అందించబోతున్నారు.
దీంతో నూతన కార్యవర్గం, కార్యనిర్వాహక వర్గంలో అధ్యక్షులు గడప రమేశ్ బాబు, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి నంగునూరి వెంకట రమణ, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్ గుప్త, బసిక ప్రశాంత్ రెడ్డి, జూలూరి సంతోష్ కుమార్, దుర్గ ప్రసాద్ ఎం, మిర్యాల సునీత రెడ్డి, ప్రాంతీయ కార్యదర్శులు, శశిధర్ రెడ్డి, బొడ్ల రోజా రమణి, నడికట్ల భాస్కర్, సంతోష్ వర్మ మాదారపు, రవి కృష్ణ విజ్జాపూర్ .. కార్యవర్గ సభ్యులు పెరుకు శివ రామ్ ప్రసాద్, శివ ప్రసాద్ ఆవుల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీశ్ పెసరు, మణికంఠ రెడ్డి, రవి చైతణ్య మైసా, చల్లా క్రిష్ణ , సుగుణాకర్ రెడ్డి తదితరులు ఉన్నట్టు తెలిపారు. సొసైటీ వెన్నంటే ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్న కార్యవర్గ సభ్యులు గర్రెపల్లి కస్తూరి శ్రీనివాస్, శ్రీధర్ కొల్లూరి, గింజల సురేందర్ రెడ్డి, ఆరూరి కవిత సంతోష్ రెడ్డి, నగమడ్ల దీప, కిరణ్ కుమార్ వీరమల్లు & రంగా పట్నాలకు కృతజ్ఞతలు తెలిపారు.