హైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్2022-23 లో సంక్షేమ రంగానికి పెద్దపీట వేశారని టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల అన్నారు. సోమవారం మంత్రి హరీష్రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా మహేష్ బిగాల మాట్లాడుతూ..ఎన్నో పథకాలతో సీఎం కేసీఆర్ తెలంగాణాలో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తున్నారని తెలిపారు. అలాగే బడ్జ్లో మన ఊరు-మన బడికి నిధులు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.