లండన్ : లండన్‌లోని ఎన్నారై బీఆర్ఎస్ యూకే కేంద్ర కార్యాలయంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పై జెస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక పై మాజీ మంత్రి హరీశ్‌రావు పీపీటీని కార్యవర్గసభ్యులు టీవీ ద్వారా వీక్షించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కమిషన్ల పేరిట కేసీఆర్‌ను బద్నాం చెయ్యాలని రేవంత్ రెడ్డి సర్కార్ చూస్తుందన్నారు.
కానీ, ప్రజలంతా గమనిస్తున్నారని రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెప్తారని ఉపాధ్యక్షుడు హరి గౌడ్ నవపేట్ తెలిపారు. రానున్న రోజుల్లో స్థానిక ఎన్నారైలకు కాళేశ్వరం ప్రాజెక్ట్ పై పూర్తి అవగాహన కలిగేలా కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను తెలియజేసేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని ఉపాధ్యక్షుడు సత్య మూర్తి చిలుముల తెలిపారు. ప్రజలకు వాస్తవాలు తెలిసేలా సోషల్ మీడియా వేదిక ద్వారా విస్తృత ప్రచారం నిర్వహిస్తామని సోషల్ మీడియా కన్వీనర్ రవి ప్రదీప్ పులుసు తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్య చిలుముల, రవి ప్రదీప్ పులుసు తదితరులు పాల్గొన్నారు.