హైదరాబాద్ : తెలంగాణ రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు చేపట్టిన రైతు ధర్నా కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎన్నారై నాయకులు పాల్గొన్నారని టీఆర్ఎస్ ఎన్నారై వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తెలిపారు.
హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్‌లో అనిల్ కూర్మాచలం పాల్గొని రైతులకు సంఘీభావం తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతుల ధాన్యాన్ని కొనుగోలు చెయ్యాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ఉద్యమంలో ఎలాగైతే రాష్ట్ర సాధనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారైలు సంఘీభావ పోరాటాలు చేసారో.. అలాగే సీఎం కేసీఆర్ పిలుపుతో కేంద్ర ప్రభుత్వం పై రైతుల కోసం పోరాటానికి వారంతా సిద్ధంగా ఉన్నారని అనిల్ కూర్మాచలం తెలిపారు.
బిజెపి ద్వంద వైఖరిని ప్రపంచ వేదికల్లో ఎండగడతామని ఆయన పేర్కొన్నారు. అలాగే టీఆర్ఎస్ ఎన్నారై యూకే ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల వరంగల్‌లో ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమంలో పాల్గొని రైతులకు సంఘీభావం తెలిపారు. రాజ్ కుమార్ శానబోయిన కూడా ధర్నాలో పాల్గొన్నారు.