కెనడాలో ఘనంగా గణపతి నవరాత్రుల వేడుకలు
Ganesh Chaturthi | కెనడాలోని కాల్గరీలో ఉన్న శ్రీ అనఘా దత్త సొసైటీలో గణపతి నవరాత్రుల వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువందనం, చతుర్వేద పారాయణం, వినాయక పూజలు సాంప్రదాయ బద్ధంగా జరిగాయి.
హైదరాబాద్: కెనడాలోని కాల్గరీలో ఉన్న శ్రీ అనఘా దత్త సొసైటీలో గణపతి నవరాత్రుల వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువందనం, చతుర్వేద పారాయణం, వినాయక పూజలు సాంప్రదాయ బద్ధంగా జరిగాయి.
కాల్గరీ డౌన్టౌన్ వీధిలో నిర్వహించిన గణనాథుడిని ఊరేగింపు అందరిని ఆకట్టుకున్నది. ఇందులో కాల్గరీ, ఎడ్మాంటన్, చుట్టు పక్కల ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 400 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. ఆ ప్రాంతమంతా మేళ తాళాలు, సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు, భగవన్నామ స్మరణలతో మారుమ్రోగింది. ఈ ఉత్సవానికి హాజరైన కెనడా పార్లమెంట్ సభ్యుడు జస్రాజ్ హల్లాన్.. కార్యక్రమ నిర్వాహకులను అభినందించారు.

శ్రీ అనఘా దత్త సొసైటీ ఆఫ్ కాల్గరీ ఆలయంలో షిరిడీ సాయిబాబా, అనంత పద్మనాభస్వామి, అనఘా దేవి, శివుడు, హనుమంతుడు, గణేశుడు, కార్తికేయ దేవతలు కొలువుదీరారు. ఆలయ నిర్వాహకులు లలిత, శైలేష్ భాగవతుల, ఆలయ ప్రధాన అర్చకుడు రాజకుమార్ శర్మ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రుల వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమం విజయవంతవడానికి సహకరించిన ఎంపీ జస్రాజ్ హలాన్, వాలంటీర్లకు శైలేష్ భాగవతుల కృతజ్ఞతలు తెలిపారు.


Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

