NRI news | అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అడ్డుకోవడం అప్రజాస్వామికం..!
NRI news | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకోవడం అత్యంత అప్రజాస్వామికమని బీఆర్ఎస్ దక్షిణాఫ్రికా విభాగం నాయకుడు నాగరాజు గుర్రాల తీవ్రంగా ఖండించారు. ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులను శాసనసభకు వెళ్లకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కులను, రాజ్యాంగ విలువలను అవమానించడమేనని పేర్కొన్నారు.
NRI news : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకోవడం అత్యంత అప్రజాస్వామికమని బీఆర్ఎస్ దక్షిణాఫ్రికా విభాగం నాయకుడు నాగరాజు గుర్రాల తీవ్రంగా ఖండించారు. ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులను శాసనసభకు వెళ్లకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కులను, రాజ్యాంగ విలువలను అవమానించడమేనని పేర్కొన్నారు.
శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపట్ల పోలీసులు వ్యవహరించిన తీరు బాధాకరమన్నారు. ముఖ్యంగా మహిళా ఎమ్మెల్యేలపట్ల అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన పోలీసు అధికారులపై తక్షణమే నిష్పాక్షిక విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి వెళ్లకుండా అడ్డుకోవద్దని రాష్ట్ర డీజీపీకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరికి చెంపపెట్టులాంటిదని అన్నారు.
ప్రజా సమస్యలపై ప్రతిపక్షం ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో సహజమైన హక్కని, పోలీసు బలంతో ప్రతిపక్ష గొంతును అణచివేయాలని ప్రయత్నించడం సరికాదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యలను వెంటనే నిలిపివేసి, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా శాసనసభకు హాజరై ప్రజల సమస్యలను ప్రస్తావించే వాతావరణాన్ని కల్పించాలని నాగరాజు గుర్రాల డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బీఆర్ఎస్ చేపట్టే పోరాటాలకు దక్షిణాఫ్రికాలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారని తెలిపారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
unknown callers | గుర్తు తెలియని కాలర్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కాలర్ పేరు తప్పనిసరి
Power crisis | కాంగ్రెస్ చేతకాని పాలనతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం : మాజీ ఎమ్మెల్యే గండ్ర
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

