ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని ఎన్నారై బీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ అధ్యక్షుడు రాధారపు సతీశ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. మొన్న హరీశ్‌రావుకు, నిన్న కేటీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడం రాజకీయ కుట్రలో భాగమేనని ఆరోపించారు. రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను, ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో జరుగుతున్న మోసాన్ని, రాష్ట్రంలో జరుగుతున్న కుంభకోణాలను బయటపెట్టినందుకే కక్ష సాధింపుగా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని నైతికంగా దెబ్బతీయడానికి, ప్రశ్నించే గొంతులను నొక్కడానికి, రాజకీయ ప్రతీకారం తీర్చుకోవడానికే నోటీసుల పేరుతో వేధిస్తున్నారని రాధారపు సతీశ్‌కుమార్ మండిపడ్డారు. రోజుకో కొత్త డ్రామాకు తెరలేపుతుందని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పసలేదని అత్యున్నత న్యాయస్థానాలు తేల్చిచెప్పినప్పటికీ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుంభకోణాల నుంచి డైవర్షన్ చేసేందుకు కేటీఆర్, హరీశ్‌రావుకు సిట్ నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. దీనిపై సమయం వచ్చినప్పుడు ప్రజలే గుణపాఠం చెబుతారని అన్నారు. బీఆర్ఎస్ నాయకత్వానికి పూర్తి మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. రాజకీయ బెదిరింపులతో తెలంగాణ ప్రజలను మోసం చేయలేరని స్పష్టం చేశారు.