హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై విషం చీమ్ముతున్న బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ సమాజానికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఎన్నారై బీఆర్ఎస్ యూకే శాఖ అధ్యక్షుడు నవీన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి తప్పుగా మాట్లాడితే బీజేపీపై తెలంగాణ సమాజం తిరగబడుతుందన్నారు.
తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోల్చినా తెలంగాణ ఎంపీలు మౌనంగా ఉండడం సిగ్గు చేటన్నారు. రానున్న రోజుల్లో మీ రెండు జాతీయ పార్టీలకు తెలంగాణ ప్రజలు తప్పక బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. అనుచితంగా మాట్లాడిన తేజస్వీ సూర్య పార్లమెంట్ సభ్యత్వం వెంటనే రద్దు చేయాలని నవీన్ రెడ్డి డిమాండ్ చేశారు.