కంటోన్మెంట్ జూలై 24. తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలపై మాజీమంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి స్పష్టతనిచ్చారు. తాను బీఆర్ఎస్లోనే ఉంటానని.. కేటీఆర్ సీఎం అవ్వడమే తన ప్రధాన ఆంకాంక్ష అని స్పష్టం చేశారు. శుక్రవారం బోయిన్పల్లిలోని తన నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని కార్యకర్తలతో కలిసి మల్లారెడ్డి కేక్ కట్ చేశారు.
మేడ్చల్ నియోజకవర్గానికి చెందిన కార్యకర్త పేరిట రక్తంతో రాసిన లేఖ తనను చాలా బాధ పెట్టిందని చిరునామా లేకున్నా ఆ కార్యకర్తను తాను తప్పకుండా కలుస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీపై విరోచిత పోరాటం చేస్తున్న కేటీఆర్ సీఎం కావాలని మల్లారెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, బీఆర్ఎస్ నాయకులు నవీన్ రెడ్డి, సందీప్ రెడ్డి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.