Danam Nagender | తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పార్టీ ఫిరాయింపుల కేసులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేసింది. 2024 ఏప్రిల్ 23 నుంచి అనర్హుడిగా ప్రకటించింది. 2024లో దానం కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేశారు. కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేయడాన్ని పరిగణలోకి తీసుకుని, హైకోర్టు స్పీకర్ తీర్పును కొట్టివేసింది.
కాగా, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేసేందుకు స్పీకర్ నిరాకరించడాన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన దానం ఆ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌లో చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్ తరఫున సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి పోటీ చేశారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు గండ్ర మోహన్‌రావు, వివేక్‌రెడ్డి హైకోర్టుకు తెలియజేస్తూ.. పార్టీ ఫిరాయింపులకు ఇంతకంటే వేరే ఆధారాలు అవసరం లేదని అతడిపై వేటు వేయాలని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకుంటామని, ఒక గంట సమయం ఇవ్వాలని ఆలోపు ఈ తీర్పు సస్పెండ్ చేయాలని దానం నాగేందర్ తరపు న్యాయవాదులు దానం నాగేందర్ తరపు న్యాయవాదుల కోరగా వారి అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. సుప్రీంకోర్టుకు వెళ్లినా ఉపశమనం దొరికే అవకాశం లేదని, ఉప ఎన్నిక తప్పదని బీఆర్ఎస్ తరపు న్యాయవాదులు చెబుతున్నారు.