నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం హర్షణీయమని టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి కొనియాడారు. చట్ట సభలకు దిశా నిర్దేశం చేసిన అంబేద్కర్, అటువంటి మహానీయుని పేరు తెలంగాణ సచివాలయానికి నామకరణం చేయడం కేసీఆర్కు.. మహనీయులు, దళిత జాతి పట్ల ఉన్న గౌరవానికి నిదర్శనమని చెప్పారు. పేదలు, బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడే అనేక సంక్షేమ పథకాలకు రూపకల్పన జరిగే దేవాలయం లాంటి శాసనసభకు అంబేద్కర్ పేరు అన్ని విధాల సముచితం అని నాగేందర్ రెడ్డి తెలిపారు.