హైదరాబాద్ : ఉమ్మడి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత బుధవారం ప్రమాణ స్వీకారం చేసారు. ఈ సందర్బంగా టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల కవితకు శుభాకాంక్షలు తెలిపారు.
ఒక గొప్ప వక్త, అన్ని రంగాలలో మంచి విషయ పరిజ్ఞానం, ప్రజా సమస్యల పై ఎనలేని పోరాట స్వభావం ఉన్న నాయకురాలు కవిత అని కొనియాడారు.
ఉమ్మడి నిజామబాద్ జిల్లా ఎమ్మెల్సీ గా కవితను ఎన్నుకోవడంతో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు భరోసా వచ్చినట్లయిందని పేర్కొన్నారు. జీవితంలో ఆమె మరిన్ని పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు.