బీజింగ్ : చైనా ఓపెన్ డబ్ల్యూటీఏ1000 టోర్నమెంట్లో ప్రపంచ రెండో ర్యాంకర్, నాలుగు గ్రాండ్‌స్లామ్స్ చాంపియన్ అరీనా సబలెంకాకు షాక్ తగింది. మూడో రౌండ్లోనే టోర్నీ నుంచి వైదొలిగింది. ఆదివారం జరిగిన పోరులో చెక్ రిపబ్లిక్ అమ్మాయి, 34వ ర్యాంకర్ నిబార్టుంకోవా 6-4, 6-3తో సబలెంకాను ఓడించి సంచలనం సృష్టించింది.
మరో మ్యాచ్‌లో రష్యా స్టార్ మీరా ఆండ్రీవా 6-4, 6-1తో కుదెర్మెతోవాను ఓడించి ముందం జ వేసింది. మరోవైపు పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో సెర్బియా లెజెండ్ నొవాక్ జొకోవిచ్ 4-6, 6-4, 6-4తో టాప్ సీడ్, యూఎస్ ఓపెన్ విన్నర్ జ్వెరెవ్ (జర్మనీ)ని ఓడించి సెమీస్ చేరాడు.