కాలిఫోర్నియా హెల్త్ఫెస్ట్కు కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాండియాగోలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ‘టాల్ హెల్త్ ఫెస్ట్-2026’కు ఆహ్వానం అందింది. విశిష్ట అతిథిగా హాజరై అమూల్యమైన సందేశం ఇవ్వాలని టచ్-ఏ-లైఫ్ (టాల్) ఫౌండేషన్ సీఈవో సాయి గుండవెల్లి ఆదివారం ఆహ్వానం పంపారు.
- 30న సదస్సుకు రావాలని కోరిన టాల్ ఫౌండేషన్ సీఈవో
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌కు దక్కిన మరో అరుదైన గౌరవం
హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాండియాగోలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ‘టాల్ హెల్త్ ఫెస్ట్-2026’కు ఆహ్వానం అందింది. విశిష్ట అతిథిగా హాజరై అమూల్యమైన సందేశం ఇవ్వాలని టచ్-ఏ-లైఫ్ (టాల్) ఫౌండేషన్ సీఈవో సాయి గుండవెల్లి ఆదివారం ఆహ్వానం పంపారు. అంతర్జాతీయ స్థాయి ఆరోగ్య, సాంకేతిక ప్రముఖులతో తమ ఆలోచనలు పంచుకోవాలని విజ్ఞప్తిచేశారు. అక్టోబర్ 30న యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఈ అంతర్జాతీయ ఆరోగ్య సదస్సు నిర్వహించనున్నారు. వైద్యరంగ భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న ముఖ్య నాయకులు, ఆరోగ్య నిపుణులు, ఆవిష్కర్తలు, వివిధ సంస్థలను ఒకే వేదికపైకి తీసుకురావాలనే సమున్నత లక్ష్యంతో ‘టాల్ హెల్త్ ఫెస్ట్-2026’ను ఏర్పాటు చేస్తున్నారు.
హాజరుకానున్న ప్రముఖులు
సదస్సులో వైద్యులు, ఆరోగ్యరంగ నిపుణులు, దవాఖానలు, ఫార్మా అండ్ మెడికల్ టెక్నాలజీ కంపెనీల బాధ్యులు, పరిశోధకులు, విద్యావేత్తలు, టెక్నాలజీ ఆవిష్కర్తలు, రోగుల హక్కుల సంఘాలు, ప్రభుత్వ ప్రతినిధులు, మెడికల్ టూరిజం బాధ్యులు హాజరుకానున్నారు. ‘ఆవిష్కరణలు, సాంకేతిక సహకారం, గ్లోబల్ యాక్సెస్ ద్వారా వైద్యరంగ పునర్నిర్మాణం’ అనే ప్రధాన ఇతివృత్తంతో ఇంటర్నేషనల్ హెల్త్ సెమినార్ నిర్వహించనున్నారు. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పర్సనలైజ్డ్ మెడిసిన్, డిజిటల్ హెల్త్‌కేర్, ప్రివెంటివ్ కేర్, మెడికల్ టూరిజం, ఆరోగ్య సంరక్షణ డెలివరీలో భవిష్యత్తు ఆవిష్కరణలపై చర్చించన్నారు. తెలంగాణలో సాంకేతిక, ఆవిష్కరణలు, వ్యవస్థాపకత, అంతర్జాతీయ భాగస్వామ్యాల విస్తరణలో కేటీఆర్ చేసిన కృషిని ఫౌండేషన్ సీఈవో సాయి గుండవెల్లి కొనియాడారు. ఈ అంతర్జాతీయ వేదికపై కేటీఆర్ భాగస్వామ్యం ఎంతో విలువైన ఆలోచనలను ఆవిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. కేటీఆర్ హాజరుకావడం ద్వారా వైద్యం, సాంకేతికత, ఆవిష్కరణలు, ప్రపంచ ఆరోగ్య సేవలకు సంబంధించి భారత్- అమెరికా దేశాల మధ్య పరస్పర చర్చలు, భాగస్వామ్యాలు మరింత బలోపేతమవుతాయని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సూర్యాపేటలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ఎన్నికల ప్రచారం
Miss Universe | విశ్వసుందరిగా ప్యూర్టో రికో భామ.. మిస్ యూనివర్స్ 2026 విజేతగా నిలిచిన జెన్నిఫర్ బారెటో
Bandla Ganesh | బండ్ల గణేష్ చెక్ బౌన్స్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఫిర్యాదుదారుడి కీలక ప్రకటనతో ఊరట!
Pakistan Astronaut | చైనా నుంచి తొలిసారిగా అంతరిక్షంలోకి పాక్ వ్యోమగామి.. 40 ఏళ్ల క్రితమే చరిత్ర సృష్టించిన భారత్!
Mississippi Plane Crash | మిస్సిసిపీ తీరంలో కూలిన విమాన ప్రమాదం.. ఆరుగురు గల్లంతు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

