న్యూఢిల్లీ : ఢిల్లీలో ఏఐఎస్ఏ ఆధ్వర్యంలో చేపట్టిన జంతర్ మంతర్ 2.0ను కవర్ చేయడానికి వెళ్లిన తమపై పోలీసులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ముగ్గురు మహిళా జర్నలిస్టులు ఆరోపించారు. ఓ మహిళా జర్నలిస్టు మాట్లాడుతూ తనను వివేక్ భగత్ అసభ్యకరంగా తాకాడని, ఆయన్ను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేసింది.
తాము ఫిర్యాదు చేసినా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయట్లేదంటూ జర్నలిస్టులు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వెలుపల ఆందోళన నిర్వహించారు. ఈ విషయంపై ప్రతిపక్ష నేత రాహుల్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా జర్నలిస్టుల కెమెరాలను లాక్కున్నారని, వేధించారని ఆరోపిస్తే ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయట్లేదని ప్రశ్నించారు. ఇదే అంశంపై ఢిల్లీ పోలీసులు ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. వారి ఫిర్యాదులను స్వీకరించామని, విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.