జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించబోతున్నామని బీఆర్ఎస్ గ్లోబల్ కో ఆర్డినేటర్ మహేష్ బిగాల తెలిపారు. గత ఇరువై రోజులుగా మా ఎన్నారైలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత విజయానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికలైన ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి అన్ని చానెల్లలో వారు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంఘాల దృష్టిని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల దిశగా మళ్లించారన్నారు.
ప్రత్యక్షంగా జనసమక్షంలో కూడా వీరి కార్యక్రమం కొనసాగుతోందని పేర్కొన్నారు. దేశ విదేశాల్లో ఉన్న మరెందరో ఎన్నారై సభ్యులు వీడియో సందేశాలు, ఆన్లైన్ మీటింగులు, సంఘ సమావేశాల ద్వారా తమ సంఘటిత మద్దతును తెలుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో ప్రలోభాలు పెట్టినా, జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్కే తుది విజయం తప్పదని మహేష్ బిగాల స్పష్టం చేశారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభ్యున్నతికి నిరంతరం కృషి చేసిన మాగంటి గోపినాథ్ సేవలను గుర్తుంచుకుని, ఆయన వారసత్వాన్ని కొనసాగించేందుకు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మహేష్ బిగాల పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ మాత్రమే ప్రత్యామ్నాయం అనే విషయం స్పష్టమతుందని చెప్పారు. అమెరికా, యుకె, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, టాంజానియా, గల్ఫ్ దేశాలు వంటి వివిధ దేశాల నుండి ఎన్నారైలంతా ఈ ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారని వివరించారు. అందరికీ మహేష్ బిగాల ధన్యవాదాలు తెలిపారు.