టీఎర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఎన్నారై కోఆర్డినేటర్, పీవీ కమిటి సభ్యులు మహేష్ బిగాల కలిశారు. ఆమెను మర్యాదపూర్వకంగా కలిసిన మహేష్ బిగాల నూతన సంవత్సర శూభాకాంక్షలు తెలియజేశారు. ఈ సమావేశంలో వివిద దేశాలలో కరోనా పరిస్థితిని వివరించి, ఆయా దేశాల్లో తెలంగాణ వాసుల యోగక్షేమాలు తెలియజేశారు.
అలాగే పీవీ శత జయంతి ఉత్సవాల విగ్రహ ప్రతిష్టాపన గురించి వివిధ దేశాలలో నిర్వహించే ప్రక్రియ గురించి వివరించారు. అమెరికా పర్యటన ముగించుకున్న మహేష్ బిగాల అక్కడ వివరాలను తెలియజేశారు. దివంగత మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు విగ్రహావిష్కరణ కోసం 2022 మే నెలలో అమెరికాలోని అట్లాంటా రావలసిందిగా కవితను ఆహ్వానించారు, దీనికి ఎమ్మెల్సీ కవిత సానుకూలంగా స్పందించారు.