KCR Cricket Cup | కేసీఆర్ క్రికెట్ కప్ పోస్టర్ను ఆవిష్కరించిన కేటీఆర్
KCR Cricket Cup | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మలేషియాలోని కౌలాలంపూర్లో జరుగుతున్న తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో శనివారం పాల్గొన్నారు.
కౌలాలంపూర్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) మలేషియాలోని కౌలాలంపూర్లో జరుగుతున్న తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో శనివారం పాల్గొన్నారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఆస్ట్రేలియా వ్యవస్థాపక అధ్యక్షులు కాసర్ల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలో నిర్వహించబోయే కేసీఆర్ క్రికెట్ కప్ పోస్టర్ ( KCR Cricket Cup ) ను ఆవిష్కరించారు.
గత దశాబ్ద కాలంగా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి చేపడుతున్న అనేక కార్యక్రమాలను ప్రశంసించారు . ఇండియన్ కమ్యూనిటీలో ఔన్నత్యాన్ని పెంపొందించటానికి , 2023 సంవత్సరంలో నిర్వహించిన ఈ క్రికెట్ టోర్నీకి ఎంతో ఆదరణ లభించిందని, అదే ప్రేరణతో ఈ సంవత్సరం కూడా నిర్వహించ తలపెట్టామని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా నాయకులు ఉప్పు సాయిరాం తెలిపారు.
పార్టీ రజతోత్సవ ఆవిర్భావ సంబరాలను ఈసారి ఆస్ట్రేలియాలో నిర్వహించేందుకు ఆ దేశంలో పర్యటిస్తానని హామీ ఇచ్చారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గ్యాదరి బాలమల్లు, బడుగు లింగయ్య యాదవ్, నంద్యాల దయాకర్ రెడ్డి, బీఆర్ఎస్ ఆస్ట్రేలియా నాయకులు రాజేష్ రాపోలు, సాయిరాం ఉప్పు , మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Balen Shah | నేపాల్ ప్రధానిగా కొత్త ఒరవడి.. చైనాకు షాకిస్తూ భారత్కు ఓటేసిన బాలెన్ షా..!
AP News | ఏపీలోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
Supreme Court | హిందూయిజం నుంచి ఇస్లాంకు మారితే బీసీ రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు తీర్పు
Gajab Raat | ‘గజ్బ్ రాత్’గా మారిన మనోజ్ బాజ్పేయ్ ‘గుస్ఖోర్ పండట్’.. ట్రైలర్ విడుదల!
Zaheerabad AO | 14 ఏళ్ల కృషికి జాతీయ గుర్తింపు.. జాతీయ ఉత్తమ అధికారిగా లావణ్య
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

