హైదరాబాద్ : మెల్బోర్న్లో(Melbourne) బీఆర్ఎస్ 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించే వేడుకలకు కేటీఆర్‌ను బీఆర్ఎస్(BRS) ఆస్ట్రేలియా బీఆర్ఎస్ విభాగం ఆధ్వర్యంలో ఆహ్వానించారు. హైదరాబాద్ల్ని ఆయన నివాసంలో ఆహ్వానించగా కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. కేటీఆర్ త్వరలో ఆస్ట్రేలియాకు వచ్చి వేడుకల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు శ్రీ నాగేందర్ రెడ్డి కాసర్ల మాట్లాడుతూ.. కేటీఆర్ పర్యటన ప్రవాస బీఆర్ఎస్ కార్యకర్తలకు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తుందని తెలిపారు. ఈ ఆహ్వాన కార్యక్రమంలో అభినయ్ కనపర్తి, సంతోష్ రెడ్డి, శ్రీవేకర్ రెడ్డి, లక్ష్మణ్ నల్లన్, యుగంధర్ రెడ్డి అల్లం, సాయి రామ్ రెడ్డి, వెంకట్ సాయి తెనుగు తదితరులు పాల్గొన్నారు.