సూర్యాపేట శాసనసభ్యులు, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ( Jagadish Reddy ) జన్మదిన వేడుకలను ( Birthday celebrations) ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో లండన్లో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ యూకే ( NRI BRS UK ) ఉపాధ్యక్షులు గొట్టేముక్కుల సతీష్ రెడ్డి అధ్యక్షతన యూకేలోని వివిధ ప్రాంతాల్లో జగదీశ్ రెడ్డి అభిమానులు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్బంగా అధ్యక్షులు నవీన్ రెడ్డి మాట్లాడుతూ జగదీష్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని, తెలంగాణ ప్రజలకు మరింత సేవ చేయాలని ప్రార్థించారు. ఉపాధ్యక్షులు గొట్టేముక్కుల సతీష్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు సాగు, త్రాగు నీరు అందించి జిల్లాను అభివృద్ధి పథంలో అగ్రగామిగా నిలిపి రైతుల కష్టాలను తీర్చారని కొనియాడారు.
ఉపాధ్యక్షులు రవి కుమార్ రేటినేని , అధికార ప్రతినిధి రవి ప్రదీప్ గౌడ్ పులుసు, హరి గౌడ్ నవాబుపేట, సత్య చిలుముల, రవికుమార్ రేటినేని, జనరల్ సెక్రటరీ రత్నాకర్ కడుదుల, ఐటీ, మీడియా సెక్రటరీ రవి ప్రదీప్ పులుసు, కోశాధికారి సురేష్ బుడగం పాల్గొన్నారు.