సౌత్ ఆఫ్రికా : ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్టార్టప్‌ల ఔత్సాహికులు, వారిని ప్రోత్సహించే వెంచర్ క్యాపిటలిస్టులు, ఏంజిల్ ఇన్వెస్టర్లకు టీ హబ్-2 ఎంతో ఉపయోగపడుతుందని గుర్రాల నాగరాజు (IBF South africa IT Chair person) తెలిపారు. ఇక్కడ రూపుదిద్దుకునే ఆవిష్కరణలు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తాయన్నారు.
నూతన ఆవిష్కరణలకు మరింత ఊతమిచ్చే టీ హబ్- 2ను సీఎం కేసీఆర్ మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా గుర్రాల నాగరాజు మాట్లాడుతూ.. తెలంగాణ ఎన్నో రంగాలలో ముందుకు వెళ్తున్నది. టీ హబ్- 2 టెక్నాలజీ ప్రియులతోపాటు, సామాన్యుల ఆలోచనలకు సైతం ఇక్కడ ప్రోత్సాహం లభిస్తుందని ఆయన తెలిపారు.
సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కృషి ప్రపంచ దిగ్గజ సంస్థలకు హైదరాబాద్ నగరాన్ని గమ్యస్థానం చేసే దిశగా ప్రయత్నాలు సఫలీకృతమవుతున్నాయన్నారు. పోటీ ప్రపంచంలో అన్నిదేశాలు తమ వద్ద కే పెట్టుబడులు తీసుకుపోవాలని, పరిశ్రమలను ఏర్పాటుచేయాలని ప్రయత్నిస్తాయి.
ఈ పరిస్థితుల్లో పోటీని ఎదుర్కొని అంతర్జాతీయ దిగ్గజ సంస్థలను హైదరాబాద్‌కు తీసుకురావడం తేలికైన విషయం కాదన్నారు. కాగా, టీఆర్ఎస్ ప్రభుత్వం పారదర్శకత, ప్రగతిశీల విధానాలు, పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఇస్తున్న రాయితీలు, అనువైన వాతావరణం, మెరుగైన మౌలిక సదుపాయాలు ఇలా అనేక సానుకూలంశాలు తెలంగాణను పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చిందని నాగరాజు పేర్కొన్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నిర్మాణనికి అహర్నిశలు కృషి చేసిన ఐటీ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ జయేష్ రంజన్, టీం సభ్యులకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.