సిటీబ్యూరో, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : మహిళపై లైంగిక వేధింపుల ఆరోపణలతో సస్పెన్షన్ వేటు పడిన జూబ్లీహిల్స్ మాజీ ఎస్‌హెచ్‌వో, సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు రెడ్డికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. తదుపరి విచారణ వరకు శ్రీనివాసులురెడ్డిని అరెస్టు చేయవద్దని, అతడిపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని నగర పోలీసులను ఆదేశిస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
మంగళవారం ఈ కేసును జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. ఓ మహిళను జూబ్లీహిల్స్ మాజీ ఎస్‌హెచ్‌వో శ్రీనివాసులు రెడ్డి లైంగికంగా వేధించడమే కాకుండా ఆమెను బ్లాక్మెయిల్ చేసి బలవంతంగా అబార్షన్ చేయించాడంటూ తీవ్ర ఆరోపణలు వచ్చాయి.ఈ నేపథ్యంలో ఇటీవల అతడిపై సస్పెన్షన్ వేటు వే శారు.