London | లండన్‌లో తెలుగమ్మాయిని ఓ బ్రెజిల్ యువకుడు దారుణంగా హత్య చేశాడు. హైదరాబాద్‌లోని చంపాపేటకు చెందిన తేజస్విని రెడ్డి ఉన్నత విద్యాభ్యాసం కోసం లండన్ వెళ్లింది. అక్కడే స్నేహితులతో కలిసి ఉంటుంది. ఈ క్రమంలో వారిపై ఓ బ్రెజిల్ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ తేజస్విని అక్కడికక్కడే దుర్మరణం చెందింది. ఈ దాడిలో మరో తెలుగమ్మాయి అఖిల తీవ్రంగా గాయపడింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇంగ్లండ్‌లోని నాటింగ్‌హామ్( Nottingham)లో దారుణం జరిగింది. 19 ఏళ్లకు చెందిన ఇద్దరు టీనేజర్లను ఓ వ్యక్తి మంగళవారం ఉదయం కత్తితో పొడిచి చంపాడు. ఆ ఉన్మాది మరో 50 ఏళ్ల వ్యక్తిని కూడా పొడిచి చంపేశాడు. ఆ తర్వాత ఓ వ్యాన్‌ను దొంగలించి దాంతో ముగ్గుర్ని గాయపరిచాడు. కత్తి దాడిలో మృతిచెందిన వారిని బార్నబి వెబర్, గ్రేస్ కుమార్‌గా గుర్తించారు. ఈ ఇద్దరూ యూనివర్సిటీ ఆఫ్ నాటింగ్‌హామ్‌లో చదువుతున్నారు. పోలీసులు మర్డర్ కేసు నమోదు చేశారు.