NRI News | జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హఠాన్మరణంపై బీఆర్ఎస్ పార్టీ దక్షిణాఫ్రికా శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజాసేవలో ముందున్న మాగంటి గోపీనాథ్ హఠాన్మరణ వార్త తీవ్ర మనోవేదన కలిగించిందన్నారు. ఆయన మరణం పార్టీకి, రాష్ట్ర ప్రజలకు తీరని లోటన్నారు. గోపీనాథ్ ప్రజల సమస్యలపై చిత్తశుద్ధితో.. వినయంగా, మానవీయతతో స్పందించేవారన్నారు. జూబ్లీహిల్స్ అభివృద్ధికి ఆయన అందించిన సేవలు మరువలేనివన్నారు. ప్రజలతో ఆయనకు ఎంతో మంచి అనుబంధం ఉందని.. ప్రజాక్షేత్రంలో ఆయన సంపాదించిన గౌరవం చిరస్మరణీయమన్నారు. బీఆర్ఎస్ దక్షిణాఫ్రికా ఎన్ఆర్ఐశాఖ తరఫున, వ్యక్తిగతంగా మాగంటి కుటుంబానికి, అభిమానులకు నా హృదయపూర్వక సంతాపాన్ని తెలుపుతున్నానన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానన్నారు.