హైదరాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే తెలంగాణ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని
నాగరాజు గుర్రాల (టీఆర్ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షుడు) అన్నారు. సోమవారం ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతు దీక్ష చేపట్టిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రైతులని మోసం చేస్తున్న కేంద్రం త్వరలోనే దాని పర్యవసానాలు చూస్తుందన్నారు.
ధాన్యం కొనాలని ఒక రాష్ట్ర ప్రభుత్వం దేశ రాజధాని ఢిల్లీలో పోరాడడం కేంద్రానికి సిగ్గు చేటని విమర్శించారు. ధాన్యం కొనుగోలుకు దేశ వ్యాప్తంగా ఒకే విధానం ఉండాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ పెట్టిన 24 గంటల ధాన్యం సేకరణ డెడ్లైన్ పై కేంద్రం ఓ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల తరపున నిరసన లో పాల్గొన్న అందరికి నాగరాజు గుర్రాల ధన్యవాదాలు తెలిపారు .