Gandham Bangaru : తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ జూలూరు గౌరీ శంకర్ (Juloori Gouri Shankar) రాసిన “బహుజనగణమన” దీర్ఘ కావ్యంను సీనియర్ జర్నలిస్ట్ గంధం బంగారు మారిషస్( Mauritius)లో ఆవిష్కరించారు. అక్కడి ఇంటర్ కాంటినెంటల్ స్లేవరి మ్యూజియం ఎదుట ఆయన ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. మానవ జీవితంలోని ప్రతిఘటన, జీవించే హక్కుకు చిహ్నంగా నిర్మించిన మ్యూజియం ముందు “బహుజనగణమన” అనే బడుగుల కావ్యాన్ని ఆవిష్కరించటం గర్వంగా ఉందని బంగారు తెలిపారు.
పోరాటం లేకుండా మానవ మనుగడ లేదని మారిషస్ మ్యూజియం చెప్పే పాఠం అన్ని అస్తిత్వ ఉద్యమాలకు ప్రేరణ అవుతుందని ఆయన పేర్కొన్నారు. బానిసత్వాన్ని ధిక్కరించడానికి ప్రాణాలు ఫణంగా పెట్టయినా సరే పోరాటం చేయాల్సిందేనని చెప్పే ఈ మ్యూజియం బీసీలకూ ఒక స్ఫూర్తి పాఠాన్ని నేర్పుతోందని ఈ సామాజిక కార్యకర్త అన్నారు.
బహుజనగణమన పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న గంధం బంగారు