Jagtial KCR Sabha | లండన్ : ఈ నెల 20న జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న సందర్భంగా ప్రజలంతా భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో లండన్ పర్యటనలో ఉన్న మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ ‘జగిత్యాల కేసీఆర్ సభ’పోస్టర్ ని ఆవిష్కరించారు.
ప్రజలంతా కేసీఆర్ సందేశం కోసం ఎదురుచూస్తున్నారని, అలాగే ఇటీవల కాంగ్రెస్కు రాజీనామా చేసి.. బీఆర్ఎస్లో చేరుతున్న జీవన్ రెడ్డికి ఎన్నారైల పక్షాన ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్, ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు రాఘవ, ఉపాధ్యక్షుడు రవి రేతినేని, సత్యమూర్తి చిలుముల, ఎన్నారై బీఆర్ఎస్ యూకే సీనియర్ నాయకులు రమేష్ ఎసెంపెల్లి , గణేష్ కుప్పాల తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.
Medical kits | తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో హోంగార్డులకు మెడికల్ కిట్లు, డ్రై ఫ్రూట్స్ పంపిణీ
F-15 Jet: ఎఫ్-15 ఫైటర్ జెట్లో విహరించిన ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్
VD x Shouryuv | ‘హాయ్ నాన్న’ దర్శకుడితో విజయ్ దేవరకొండ.. క్రేజీగా అనౌన్స్మెంట్ పోస్టర్!