హైదరాబాద్ : మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు, యూఎస్ఏ బీఆర్ఎస్ అడ్వైజరీ చైర్ పర్సన్ మహేశ్ తన్నీరు, ఎన్నారై బీఆర్ఎస్ కోఆర్డినేట్ మహేశ్ బిగాలను డెన్మార్క్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ శ్యామ్ ఆకుల మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు, మహేశ్‌ను శ్యామ్ ఆకుల పరామర్శించారు.

ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ నైతిక విజయం సాధించిందని మహేశ్ బిగాల అన్నారు. ఎన్నారై బీఆర్ఎస్ భవిష్యత్ కార్యకలాపాల గురించి, కేసీఆర్ మళ్లీ సీఎం అయ్యే వరకు ఎన్నారైల పాత్రపై చర్చించారు. ఉప ఎన్నికలో బిఆర్ఎస్ పార్టీకి ప్రచారం చేసిన ఎన్నారైలకు మహేష్ బిగాల కృతజ్ఞతలు తెలిపారు. మహేశ్ బిగాలను కలిసిన వారిలో శ్రీనివాస్ ఆకుల, రూపేష్ రెడ్డి కూడా ఉన్నారు.
