మలేసియా : మలేషియా తెలంగాణ అసోసియేషన్(మైటా) దశాబ్ది ఉత్సవాలు అంబరాన్నంటాయి. నవంబర్ 9న మలేషియాలో జరిగిన వేడుకల్లో వేలాది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కాగా, మలేషియాలో స్థిరపడ్డ తెలంగాణ బిడ్డలకు ఎలాంటి కష్టం రాకుండా అందరికి తోడ్పాటుగా నిలుస్తూ.. తెలంగాణ సంప్రదాయం, కట్టు, బొట్టును కాపాడుకుంటూ ముందుకు సాగుతున్న ప్రస్థానం మలేషియా తెలంగాణ అసోసియేషన్ది.
కాగా, 2014లో తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత మలేషియాలో స్థిరపడ్డ తెలంగాణ వాసులందరూ కలిసి మలేషియా తెలంగాణ అసోసియేషన్ను స్థాపించారు.
తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ సంప్రదాయాన్ని తెలంగాణ కట్టు, బోట్లని మరిచిపోకుండా ఆపన్నులకు అండగా ఉంటూ ముందుకెళ్తున్నారు. ఈ ఉత్సవాల్లో తెలంగాణ సంప్రదాయం ప్రతిబింబించేలా భారీ కాకతీయ తోరణం, తెలంగాణ తల్లి విగ్రహం, బతుకమ్మ, బోనాల ప్రతిమలు, సమ్మక్క,సారక్కల గద్దెలు, యాదాద్రి మందిరం నుంచి భద్రకాళి మందిరం వరకు.. వేయి స్తంభాల గుడి, చార్మినార్, మక్కా మసీద్, మెదక్ చర్చి, ఇలా తెలంగాణలోని పలు హిస్టారికల్ ప్రదేశాలన్నీ సెట్టింగులుగా వేసి భారీ వేడుకను నిర్వహించారు.
ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా త్రిపుర చీఫ్ జస్టిస్ టి. అమర్ నాథ్ గౌడ్, ఇండియన్ హై కమీషనర్ బి.ఎన్. రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాత్, పీసీసీ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు గాదరి కిశోర్, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కుమార్ మొలుగారం, అగ్రికల్చరల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్దాస్ జానయ్య , ఆకునూరి మురళి(రిటైర్డ్ ఐఏఎస్) తదితరులు పాల్గొన్నారు. మలేషియా అసోసియేషన్ సభ్యులు చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను వక్తలు కొనియాడారు. పది సంవత్సరాల క్రితం స్థాపించబడ్డ ఈ సంస్థ నిర్విరామంగా కొనసాగిస్తున్న సేవా కార్యక్రమాలను, సభ్యులందరినీ అభినందించారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి మైటా ప్రెసిడెంట్ సైదం తిరుపతి, వైస్ ప్రెసిడెంట్ చిరుత చిట్టిబాబు , మహిళా ప్రెసిడెంట్ కిరణ్మయి, జనరల్ సెక్రటరీ సందీప్ గౌడ్, జాయింట్ సెక్రటరీ సత్యనారాయణ రావు, ట్రెజరర్ సందీప్ కుమార్ లగిశెట్టి, జాయింట్ ట్రెజరర్ సుందర్ రెడ్డి, యూత్ ప్రెసిడెంట్ సంతోష్ దాసరాజు, యూత్ వైస్ ప్రెసిడెంట్ శివ తేజ, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మారుతి, హరి ప్రసాద్, రాములు, రమేష్, మహేష్, శ్రీహరి, జీవన్ రెడ్డి, వినోద్, రఘుపాల్ రెడ్డి, రంజిత్ రెడ్డి, జ్యోతి నాంపల్లి, సుప్రియ కంటే, మిథున్ శృతి, రాధిక, పూర్ణ లత, నరేందర్ రెడ్డి, అనిల్ రావు, వెంకట్, వినోద్, హరీష్, శశి గీత ధన్యవాదాలు తెలిపారు.