బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు అమెరికాలోని డాలస్ ముస్తాబవుతున్నది. పార్టీ 25 ఏండ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పురస్కరించుకొని వచ్చే నెల 1 డాలస్‌లోని డీఆర్ పెప్పర్ అరేనా వేదికగా జరుగనున్న ఈ సంబురాలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. దీనిలో భాగంగా డాలస్‌లో అన్ని సంస్థల ప్రముఖులు అందరితో సన్నాహక సభ జరిగింది . వక్తలు అందరూ మాట్లాడుతూ కేటీఆర్ రాక గురించి అందరం ఎదురు చూస్తున్నామని అన్నారు.
NRI కోఆర్డినేటర్ మహేశ్ బిగాల మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం చిన్న రజతోత్సవ సభలా ఉందని అన్నారు. డాలస్‌లో ఉన్నా అందరూ ప్రముఖులు రావడం సంతోషంగా ఉందని తెలిపారు. జూన్ 1 నాడు మీ కుటుంబ సభ్యులు, మీ ఉద్యోగులు అందరూ భారీ ఎత్తున రావాలని కోరారు. అన్ని రకాల పనులు ఊపందుకున్నాయని తెలిపారు. ఈ వేడుకల్లో అందరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ఈ సభను నిర్వహించడానికి కొద్దీ సమయంలోనే సమన్వయ పరిచిన సురకంటి శ్రీనివాస్‌ను మహేశ్ బిగాల అభినందించారు.
BRS USA Advisory Chair మహేశ్ తన్నీరు మాట్లాడుతూ.. తెలంగాణ నుంచి కళాకారులూ పెద్ద ఎత్తున రావడం జరుగుతుందని తెలిపారు. అన్ని రకాల సాంసృతిక కార్యక్రమాలతో సభ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సభకు మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, కోలేటి దామోదర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. తెలుగు రాష్ర్టాల్లో 25 ఏండ్లు మనుగడ సాగించిన పార్టీల్లో బీఆర్ఎస్ ఒకటి అని పేర్కొన్నారు. ఏప్రిల్ 27న వరంగల్‌లో బీఆర్ఎస్ రజతోత్సవ సభను అట్టహాసంగా నిర్వహించుకున్నామని తెలిపారు. ఇదే స్ఫూర్తితో డాలస్‌లో ఈ కార్యకమాన్ని జరగబోతుందని అన్నారు