Deeksha Diwas : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుని నవంబర్ 29కి 15 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఘనంగా దీక్షా దివస్ వేడుకలు నిర్వహించారు. తెలంగాణతోపాటు దేశవిదేశాల్లోని తెలంగాణ సమాజం ఈ వేడుకలు జరుపుకుంది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్బోర్న్, బ్రిస్బేన్లలో కూడా దీక్షా దివస్ వేడుకలు ఘనంగా జరిగాయి.
ఆస్ట్రేలియా బీఆర్ఎస్ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో దీక్షా దివస్ను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి ప్రసంగించారు. కేసీఆర్ ఉద్యమ సమయంలో, దీక్షా సమయంలో చేసిన త్యాగాలను గుర్తుచేశారు. రాష్ట్రం సిద్ధించిన తర్వాత తెలంగాణ అభివృద్ధికి చేసిన కృషిని గురించి, ప్రవేశపెట్టిన పథకాల గురించి వివరించారు.
సిడ్నీలో వైస్ ప్రెసిడెంట్ రాపోలు రాజేష్ గిరి ఆధ్వర్యంలో జరిగిన సభలో మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సిద్ధికి కేసీఆర్ చేసిన కృషిని కొనియాడారు. దేశ చరిత్రలో కేసీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోయిన తరుణంలో.. ఆస్ట్రేలియా జాతికి కూడా ఆయన త్యాగాన్ని పరిచయం చేయడానికే ఈ కార్యక్రమం నిర్వహించామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో రవి శంకర్ దుపాటి, సంగీత దుపాటి, మధు మోహన్ రావు, అజాజ్ మొహమ్మద్, వేణుగోపాల్ దూరిశెట్టి, అంజిత్ పైల్ల, అవినాష్ అడ్లూరి, మస్న అరుణ్లతో పాటు ప్రవాస తెలంగాణ బిడ్డలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.