BRS NRI South Africa | జూబ్లీహిల్స్ బైఎలక్షన్ ప్రచారంలో బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా టీమ్ మరింత ఉత్సాహంగా పాల్గొంటోంది.
బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు గుర్రాల నాగరాజు ఆదేశాల మేరకు బృందం యూసుఫ్‌గూడ, వెంకటగిరిలో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహిస్తూ, ప్రజలకు తెలంగాణ అభివృద్ధిని కొనసాగించేది కేవలం బీఆర్ఎస్ మాత్రమేనని వివరించారు. ఈ ప్రచారంలో నరేందర్ రెడ్డి మేడసాని, గుండ జైవిష్ణు , నరేష్ తేజ యాదారి పాల్గొని ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధికి పునాది వేశారని, రైతుల కోసం రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ వంటి పథకాలు అమలు చేశారని చెప్పారు. అలాగే పేదల కోసం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఆసరా పింఛన్లు, విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్, విదేశీ విద్యాసహాయం పథకాలు ప్రజల జీవితాలను మార్చాయని తెలిపారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి మాగంటి సునీత విజయం ఖాయమని వారు నమ్మకం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించనున్న భారీ రోడ్‌షోలో బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా టీమ్ కూడా పాల్గొని మద్దతు తెలపనుంది. ఈ సందర్భంగా గుర్రాల నాగరాజు మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ప్రజలు మరోసారి బీఆర్ఎస్పైనే విశ్వాసం ఉంచారు. కేకే సర్వే ప్రకారం అధికార కాంగ్రెస్ పార్టీ దరిదాపుల్లో కూడా లేదని, బీఆర్ఎస్ భారీ విజయం దిశగా దూసుకుపోతోందని.. బీఆర్ఎస్ తప్పకుండా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.




KTR | ఓటు వేయకపోతే ప్రశ్నించే హక్కు కోల్పోతారు.. జూబ్లీహిల్స్ ఓటర్లకు కేటీఆర్ సూచన
ISRO | నిప్పులు చిమ్ముతూ.. నింగిలోకి దూసుకెళ్లిన ఇస్రో బాహుబలి రాకెట్..!
Khawaja Asif | మమ్ములను ఘర్షణలతో బిజీగా ఉంచాలన్నదే భారత్ వ్యూహం.. మరోసారి పాక్ ప్రేలాపన