బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబురాలకు అమెరికాలోని డాలస్ ముస్తాబవుతున్నది. పార్టీ 25 ఏండ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పురస్కరించుకొని వచ్చే నెల 1 డాలస్‌లోని డీఆర్ పెప్పర్ అరేనా వేదికగా జరగనున్న ఈ సంబురాలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సమావేశం ఏర్పాట్లు కొమెరికా సెంటర్లో వేగంగా జరుగుతున్నాయి.
ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల, BRS USA Advisory Chair మహేశ్ తన్నీరు గత 15 రోజులుగా ఎక్కడికక్కడ అమెరికాలో వివిధ ప్రాంతాలలో సన్నాహక సభలు జరుపుతున్నారు. అక్కడే రజతోత్సవ సభలు, ఆవిర్భావ దినోత్సవం జరుగుతుండటంతో అందరూ పాల్గొంటున్నారు. ఉత్సహంగా రెజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. మొట్టమొదటి సారిగా ఒక ప్రాంతీయ పార్టీలో ఎప్పుడూ జరగనంతగా భారత దేశం అవతల పెద్ద ఎత్తున డాలస్‌లో ఈ సభ జరుగుతుందని వారు అన్నారు. అందరూ కేటీఆర్ పర్యటన గురించి వేచి చూస్తున్నామని చెప్పారు. ఈ సభకు మాజీ మంత్రులు, వివిధ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పాల్గొంటున్నారని తెలిపారు. డాలస్‌లో జరిగే సభ ద్వారా పెద్ద ఎత్తున మద్దతు వస్తుందని ఆశిస్తున్నానమని పేర్కొన్నారు. అందరూ సభకు 4 గంటలకు రావాలని సూచించారు.
సమావేశ ఏర్పాట్లను ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల, BRS USA Advisory Chair మహేశ్ తన్నీరు బృందం, వేదిక ఏర్పాట్లు, కళాకారుల బృందం వేదిక ఏర్పాట్లు, తెలంగాణ సంస్కృతి అలంకరణ ఏర్పాట్లు, బతుకమ్మ , కోలాటం, భోజనం, పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు ఈ పర్యవేక్షణలో భాగంగా శ్రీనివాస్ సురకుంటి, అభిలాశ్ రంగినేని, పుట్ట విష్ణువర్ధన్ రెడ్డి, ముఠా జయసింహ, ఆశిష్ యాదవ్, శ్రీనివాస్ సురభి, హరికృష్ణ దొర్నాల, నరసింహ నాగులవంచలు పరిశీలించారు. అమెరికాలో నిర్వహించే రజతోత్సవ సభ బీఆర్ఎస్ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందని అభిప్రాయపడ్డారు.