KCR | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సంబరాలను బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు.. మహేశ్ బిగాల సూచనలతో బీఆర్ఎస్ కువైట్ సభ్యులు మొక్కలు నాటి కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా అభిలాష గొడిశాల మాట్లాడుతూ.. కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలియజేశారు. నైజీరియా దేశస్తుడు ఛాస్ కూడా కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు అభిలాష గొడిశాల, సుభాన్ సోహెల్, సురేశ్ గౌడ్, ప్రమోద్ కుమార్, అయ్యప్ప, మహబూబ్, లవన్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.