హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ( KTR) పై సిట్ దర్యాప్తుకు పిలవడాన్ని బీఆర్ఎస్ డెన్మార్క్ ( BRS Denmark ) అధ్యక్షుడు శ్యామ్ ఆకుల (Syam Akula ) తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షకు పాల్పడుతుందని విమర్శించారు. విపక్ష నాయకులను వేధించడానికి చేస్తున్న దుర్మార్గమైన చర్య అని అన్నారు.
సమయాన్ని వృథా చేయడంతో పాటు రాష్ట్రంలో నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేకత నుంచి దృష్టిని మరల్చడానికి నాయకులపై కేసులు వేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే ఈ కేసులో ఎలాంటి సారాంశం లేదని సుప్రీం కోర్టు స్పష్టంగా తెలిపిందని పేర్కొన్నారు. అధికార పార్టీ నిరాశ , భయంలో కొట్టుమిట్టాడుతుందని అన్నారు. కే
వలం రాజకీయ ప్రతీకారం తీర్చుకోవడానికి, బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి చేస్తున్న కుట్ర అని ఆరోపించారు. బీఆర్ఎస్ డెన్మార్క్ సభ్యులంతా కేటీఆర్, బీఆర్ఎస్ నాయకత్వానికి పూర్తి మద్దతు ఇస్తున్నామని స్పష్టం చేశారు. రాజకీయ బెదిరింపులతో తెలంగాణ ప్రజలను మోసం చేయలేరని వెల్లడించారు.