BRS Bahrain | తెలంగాణ అస్తిత్వ వైభవానికి , స్వరాష్ట్ర ప్రతీక తెలంగాణ తల్లి అని బీఆర్ఎస్ ఎన్నారై బహ్రెయిన్ శాఖ అధ్యక్షుడు రాధారపు సంతోష్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ తల్లి ప్రస్తావన ఈనాటిది కాదని, 60 ఏండ్లు తెలంగాణ ప్రాంతాన్ని నిలువెత్తు మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రం లో నిరాదరణకు గురైన తెలంగాణా తల్లి భావన తిరిగి మాలి దశ తెలంగాణా ఉద్యమంలో పునర్జీవనం పొందిందన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మేధావులు, సాహిత్యకారులు , కళాకారులతో ఉద్యమనేత కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించి తెలంగాణ రూపు రేఖలను తయారు చేశారని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
`తెలంగాణ తల్లి ఈ మట్టిలోనుంచి , తెలంగాణ ఉద్యమ భావో ద్వేగాల నుంచి పుట్టిన అస్తిత్వ ప్రతీక. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ మీద ద్వేషంతో, కేసీఆర్ గారి ఆనవాళ్లు చెరిపేయాలని కక్షతో ఈరోజు మీరు తెలంగాణ తల్లి రూపు రేఖలు మర్చి కొత్త విగ్రహం తెలంగాణ సెక్రటేరియట్లో ఆవిష్కరించారు.మీరు పెట్టిన కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ చెయ్యి గుర్తు తల్లి అంటారు. దానిని తెలంగాణ తల్లి అని ఎవరు కూడా అనరు` అని రాధారపు సతీశ్ కుమార్ వ్యాఖ్యానించారు.
`ముఖ్యంగా తెలంగాణ ఆడపడుచులు గౌరవంగా భావించే బతుకమ్మ లేకుండా తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుందా? తెలంగాణ తల్లి అంటే ఒక దేవత మూర్తి కిరీటం లేకుండా దేవత వుంటుందా ? ప్రజలు నాలుగు మంచి పనులు చేయమని అధికారం ఇస్తే, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేక చేతులెత్తేసి ఇచ్చినా హామీలను చేయ చేతగాక ఉన్నవాటిని చెడగొడుతున్నారు. తెలంగాణ తల్లి రూపురేఖలు మర్చి తెలంగాణ ప్రాంత అస్తిత్వాన్ని దెబ్బతిస్తున్నారు. కాకతీయ కళా తోరణం, చార్మినార్ ఆనవాళ్లను చెరిపేయాలనే కుట్రలు చేస్తున్నారు` అని ఆరోపించారు.
`పేర్లు మార్చుడు, లోగోలను మార్చుడు, విగ్రహాలను మార్చుడు, ఇదేనా మార్పు అంటే మీ రాజకీయాల కోసం మారుస్తున్నారు. మీరు మార్చేది విగ్రహాలు కాదు తెలంగాణ ప్రజల బ్రతుకులను మార్చండి. అప్పుడే మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు. అదానీ, సీఎం రేవంత్ రెడ్డి ఫొటోతో కూడిన టీ షర్టులతో నిరసన తెలుపుతూ శాసనసభ సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను వెళ్లకుండా అడ్డుకొని అరెస్టులు చేయడాన్ని ఖండిస్తున్నాం` అని రాధారపు సతీశ్ కుమార్ పేర్కొన్నారు.