ఈ నెల 27వ తేదీన వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని ఎన్నారై బీఆర్ఎస్ బహ్రెయిన్ అధ్యక్షుడు రాధారపు సతీశ్‌కుమార్, ఉపాధ్యక్షుడు బొలిశెట్టి వెంకటేశ్ పిలుపునిచ్చారు. బహ్రెయిన్ బృందం కూడా ఈ సభలో పాల్గొంటుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చడానికి టీఆర్ఎస్(బీఆర్ఎస్)ను స్థాపించి కేసీఆర్ అనేక పోరాటాలు చేసి, ఎన్నో అవమానాలు, మరెన్నో అవహేళనలు అన్నింటినీ అధిగమించారని వారు తెలిపారు. చావు నోట్లో తలపెట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కలను సాకారం చేశారని పేర్కొన్నారు. ఉద్యమ సారథే రాష్ట్రానికి రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి, పదేండ్ల పాలనలో తెలంగాణను దేశానికే దిక్సూచిగా మార్చిన పరిపాలనా దక్షుడు కేసీఆర్ అని కొనియాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రం ప్రగతి పరుగులు తీస్తూ, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. 16 నెలల్లోనే రాష్ట్రాన్ని ఆగం చేసి, దివాళా తీసే స్థాయికి దిగజార్చిన సీఎం రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో ఎన్నారై బీఆర్ఎస్ సెల్ అధ్యక్షులు రాధారపు సతీశ్ కుమార్, ఉపాధ్యక్షుడు బొలిశెట్టి వెంకటేశ్, ప్రధాన కార్యదర్శి మగ్గిడి రాజేందర్, అన్నారం సుమన్, కార్యదర్శులు, చెన్నమనేని రాజేందర్ , ఉత్కం కిరణ్ గౌడ్, చిలుకూరి రాజలింగం, తిప్పారవేణి శ్రీనివాస్, దేవదాస్, కొడారి రాజేందర్, జాడి వెంకటేశ్, చిన్న గంగారాం, చివేరి రాము బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.