హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతని భారీ మెజారిటీతో గెలిపించాలని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా బృందం సిడ్నీ నుండి ఓటర్లను కోరింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఆస్ట్రేలియా వైస్ ప్రెసిడెంట్ రాజేష్ గిరి రాపోలు మాట్లాడుతూ..ఉప ఎన్నికల్లో ఓటర్లంతా విజ్ఞతతో ఆలోచించి ప్రజల పక్షాన ప్రశ్నించే బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. రవీందర్ చింతామణి మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి రాష్ట్రాన్ని విధ్వంస దిశగా నడిపించింది.
తెలంగాణ రాష్ట్ర సాధనలోనే కాకుండా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. రెండేళ్ల పాలనలో ఏం నష్టపోయాం ఏం కోల్పోయారో అంత మీ ముందు ఉంది ,నోటికొచ్చిన హామీలన్నీ ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మోసం చేశారు అని రవిశంకర్ దూపాటి అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించి కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాల ని బుల్డోజర్ కు కారుకు మధ్య పోటీ నడుస్తోందని కారు గుర్తుకు ఓటేసి సునీతను భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సభ్యులు పరశురామ్ ముతుకుల్ల, రాహుల్ రాంపల్లి, సుతారి మాధుకర్, సుమన్ బి, శ్రీనివాస్ సుతారి, రాజేష్ ఎం, రాజ్‌కుమార్ నర్మేటి పాల్గొన్నారు.